ఒక్కరోజే 90 శాతం పెరిగిన షేరు.. ఇది కదా ఐపీఓ అంటే..!

మీరు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఎలాంటి స్టాక్స్ ఎంచుకుంటున్నారు మరి. కొన్ని స్టాక్స్ మాత్రం మార్కెట్ లాభనష్టాలతో ఎలాంటి సంబంధం లేకుండా దూసుకెళ్తుంటాయి. ముఖ్యంగా ఐపీఓలు ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలు అందిస్తుంటాయి. లిస్టింగ్‌తోనే వేలల్లో, లక్షల్లో లాభాలు కూడా ఇస్తుంటాయి. ఇటీవలి ఐపీఓల చరిత్ర కూడా సానుకూలంగానే ఉంది. గతేడాది నవంబర్‌లో వచ్చిన ఐఆర్ఈడీఏ, టాటా టెక్నాలజీస్, ఆజాద్ ఇంజినీరింగ్, మోతీసన్స్ జువెల్లర్స్, ఐనాక్స్ ఇండియా ఇలా అప్పటి నుంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్‌తో ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇవాళ అలాగే ఒక ఐపీఓ అదిరిపోయే ప్రీమియంతో లిస్టింగ్ నమోదు చేసింది. ఇన్వెస్టర్లకు తొలిరోజే దాదాపు వారి పెట్టుబడిని డబుల్ చేసిందని చెప్పొచ్చు. అదే ఆర్ఎన్ఎఫ్‌ఐ సర్వీసెస్ లిమిటెడ్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఓ ధరతో పోలిస్తే ఏకంగా 90 శాతం అదనంగా రూ. 199.50 వద్ద NSE SME ఎక్స్చేంజీలో లిస్టయింది. ఇష్యూ ధర కేవలం రూ. 105 మాత్రమే కావడం గమనార్హం. ఇక్కడితో చూస్తే 90 శాతం పెరిగింది. దాదాపు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) అంత ధరతోనే లిస్టయింది. జీఎంపీ 85 శాతంగా చూయించగా.. అంతకంటే 5 శాతం ఎక్కువతోనే ఎంట్రీ ఇవ్వడం విశేషం.

90 శాతం పెరిగినప్పటికీ.. మళ్లీ లోయర్ సర్క్యూట్ కొట్టింది. 5 శాతం పతనంతో ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 189.55 వద్ద ఉంది. అంటే చివరకు ఈ స్టాక్ తొలిరోజు 80 శాతం పెరిగిందన్నమాట. ఈ కంపెనీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జులై 22న ప్రారంభమై.. జులై 24న ముగిసింది. జులై 25న విజయవంతమైన ఇన్వెస్టర్లకు షేర్లను అలాట్ చేసింది. జులై 29న ఇక మార్కెట్లో లిస్టయింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు