స్వల్పంగా పెరిగిన ధర
దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర యావరేజిగా రూ. 69,170గా ఉంది. నిన్న (సోమవారం) అది 69,140గా విక్రయించారు. బంగారంతోపాటు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.100 వరకు పెరిగింది. బంగారం, వెండి సహా పలు ఉత్పత్తులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే.
సిటీలో ఇలా
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,170గా ఉంది. ఢిల్లీ, ముంబై, పుణెలో కిలో వెండి ధర రూ.84,400కి చేరింది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది.
ఢిల్లీ, ముంబై
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,550గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,320గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,400గా పలికింది. మేలిమి బంగారం ధర రూ.69, 170గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,140గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69, 970గా ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,410గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది.









