1947 నుంచి ఎంత ఉందో తెలుసుకోవాలని ఉందా?..
(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్):
బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి అవకాశం. భారీగా తగ్గి ఇప్పుడు వరుసగా రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్లు మొదలనుతున్నాయి. దీంతో బంగారం, వెండికి గిరాకీ భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పుంజుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అందుకే పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణంగా చెప్పవచ్చు.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితుల కారణంగా బంగారం పడిపోయే అవకాశమూ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం ఆగస్టు 6వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటు..
అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్లో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయి మళ్లీ పుంజుకుంది. దాదాపు 5 డాలర్లు దిగివచ్చి ఇప్పుడు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,416 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం 27.52 డాలర్ల గరిష్ఠ స్థాయి వద్దే ట్రేడవుతోంది. మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి మరింత పడిపోయింది. రికార్డ్ స్థాయికి దిగజారి రూ.84.070 వద్ద అమ్ముడవుతోంది.
రెండో రోజూ స్థిరంగా బంగారం ధర
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు రెండో రోజూ స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు ఏ మార్పు లేకుండా 10 గ్రాములకు రూ. 64 వేల 700 వద్దే ఉంది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర తులానికి రూ. 70 వేల 580 వద్దే ట్రేడవుతోంది. ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నా 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ. 64 వేల 850 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులానికి రూ.70 వేల 730 వద్ద ఉంది.
మళ్లీ పెరిగిన వెండి ధర
బంగారం ధర ఊరట కల్పించినా వెండి మాత్రం షాకిస్తోంది. ఇవాళ కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 200 పెరిగింది. దీంతో కిలో రేటూ రూ. 91 వేల 100 కు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర ఇవాళ రూ. 200 పెరిగి రూ. 85 వేల 700 వద్దకు చేరింది. ఈ బంగారం, వెండి ధరల్లో జీఎస్టీ, టీసీఎస్ సహా ఏ ట్యాక్సులు కలపలేదు. వాటన్నింటినీ కలుపుకొంటే మాత్రం ధరలు ఇంకా కాస్త ఎక్కువే ఉండే అవకాశం ఉంది.
1947 నుంచి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..










