భారీగా పెరిగి ఇప్పుడు ఇలా.. నేటి బంగారం ధరలు ఇవే.. హైదరాబాద్‌లో ఎంతుందంటే?

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వారం రోజులుగా వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. అయితే భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్‌ రేట్లు ఇవాళ స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించాయి. గ్లోబల్‌ మార్కెట్లో ధరలు రికార్డ్‌ గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో దేశీయంగా మరింత పెరిగే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 19వ తేదీన హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్న తులంపై రూ.1050 పెరగగా.. ఇవాళ స్థిరంగా రూ. 66 వేల 700 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు స్థిరంగా రూ.72 వేల 770 వద్దే ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ తులానికి రూ.66 వేల 850 వద్దే స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో తులానికి రూ. 72 వేల 920 పలుకుతోంది.

స్థిరంగా వెండి రేట్లు

క్రితం రోజు ఏకంగా రూ.2000 పెరిగిన కిలో వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ఇవాళ కిలో వెండి ధర రూ. 91 వేల వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ఏ మార్పు లేకుండా రూ. 86 వేల వద్ద ఉంది. అయితే, పైన పేర్కొన్న గోల్డ్, సిల్వర్ రేట్లలో ఎలాంటి పన్నులు చేర్చలేదు. ప్రాంతాలను బట్టి ట్యాక్సులు మారుతుంటాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. అందుకే కొనుగోలు చేసే ముందు రేట్లు తెలుసుకోవడం మంచిది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు