బాప్‌రే.. నాలుగేళ్లలోనే లక్షకు రూ. 92 లక్షలు.. ఇన్వెస్టర్ల దశ తిప్పిన స్టాక్‌ ఇదే..

ఏకంగా 9200 శాతం రిటర్న్స్‌!

(మార్కెట్‌కబుర్లు, హైదరాబాద్‌):
స్టాక్‌ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ.. సరైన ఆర్థిక క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చు. అందుకు ఇదే నిదర్శనం.. కొంతకాలంగా ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాల్ని అందించిన ఒక మల్టీబ్యాగర్‌ స్టాక్‌ గురించి తెలుసుకుందాం. లక్ష పెట్టుబడిని రూ. 92 లక్షలు చేసింది.

రిస్క్‌ లేని పెట్టుబడుల కోసం అయితే చాలా మంది బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇలాంటివి ఎంచుకుంటారు. ఇంకొందరు భారీ రిటర్న్స్‌ ఆశించి మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయినప్పటికీ రిస్క్‌ ఉన్నా కూడా లాంగ్‌ టర్మ్‌లో మంచి సంపద సృష్టించొచ్చన్న అంచనాలతో స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఇక్కడ స్టాక్‌ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ.. సరైన విధంగా ఆర్థిక నిపుణుల సలహాతో ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు అందిస్తుందని చెప్పొచ్చు.

నిలకడగా రాణిస్తున్న స్టాక్‌ ఇదే..
ఇలా లాంగ్‌ రన్‌ లో మంచి లాభం అందించిన స్టాక్‌ లాయిడ్స్‌ మెటల్స్‌ అండ్‌ ఎనర్జీ లిమిటెడ్‌. మార్కెట్లలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఇది మాత్రం నిలకడగా రాణిస్తూ వచ్చింది. అప్‌ వర్డ్‌ ట్రాజెక్టరీలోనే కొనసాగింది. నాలుగు సంవత్సరాల కిందట ఈ షేరు ధర రూ. 9 వద్ద ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా 9200 శాతానికిపైగా పెరిగి రూ. 750 లెవెల్స్‌కు చేరింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది.

అంటే నాలుగేళ్ల కిందట రూ. 9 దగ్గర ఉన్నప్పుడు ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్‌ చేసినట్లయితే వారి సంపద ఇప్పుడు రూ. 93 లక్షలకు చేరేది. ఇక్కడ రూ. 92 లక్షలు లాభం వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఈ స్టాక్‌ కేవలం 4 సంవత్సరాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది.

ఈ కంపెనీ ఇన్నేళ్లు అద్భుత ప్రదర్శనతోనే ఇంతలా షేరు ధర పెంచుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 2020 సంవత్సరంలో ఈ స్టాక్‌ 32 శాతం పెరిగింది. మరుసటి ఏడాది అంటే 2021లో ఏకంగా 905 శాతం పుంజుకుంది. 2022లో 144 శాతం, 2023లో 144 శాతం చొప్పున ఎగబాకింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూసినా కూడా 24 శాతం పెరిగిందీ షేరు. అంటే ఈ క్రమంలో రూ. 602 నుంచి రూ. 740 కి పెరిగింది. కంపెనీ తన ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ కెపాసిటీని 2020లో 3 ఎంటీపీఏ గా ఉండగా.. ఇప్పుడు 2023 నాటికి దానిని 10 ఎంటీపీఏ కు పెంచుకుంది. ఇక దీనిని 2030 నాటికి 55 ఎంటీపీఏ కు పెంచుకోవాలని చూస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు