కొత్త కారు కొనేవారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌.. నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన!

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):
మీరు కొత్త కారు లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో అదిరే శుభవార్త అందించింది కేంద్ర సర్కార్‌. మీరు మీ కొత్త కారుపై భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. డిస్కౌంట్‌ పొందేందుకు ఏం చేయాలో చెప్పారు.

కమెర్షియల్, ప్యాసెంజర్‌ వెహికల్‌ తయారీ కంపెనీలు కొత్త వాహనల విక్రయాలపై డిస్కౌంట్‌ కల్పించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అయితే, అందుకు ఓ కండీషన్‌ ఉందని చెప్పారు. తమ పాత వాహనాన్ని తుక్కుకు సమర్పించి వాలిడ్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి కంపెనీలు డిస్కౌంట్‌ ఇస్తాయన్నారు. స్క్రాప్‌ పాలసీకి కంపెనీలు అంగీకరించాయన్నారు. అంటే మీరు పాత కారును స్క్రాప్‌ కి అప్పగించి సర్టిఫికెట్‌ తీసుకుంటే కొత్త వాహనంపై భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు.

ఢిల్లీలోని భారత్‌ మండపంలో నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో మంగళవారం జరిగిన పరిశ్రమల సమాఖ్యా మండలి సియామ్‌ సీఈఓల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న వివిధ కీలకమైన సమస్యపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు.. దేశంలో 1000 కిపైగా వెహికల్‌ స్క్రాపింగ్‌ కేంద్రాలు, 400 లకుపైగా ఆటోమెటెడ్‌ ఫిట్‌నెస్‌ టెస్‌ సెంటర్లు అవసరమని నితిన్‌ గడ్కరీ గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. నేషనల్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ అనేది వాటాదారులందరికి లాభదాయకంగా ఉంటుందన్నారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద స్క్రాపింగ్‌ హబ్‌గా భారత్‌ నిలువనుందని తెలిపారు.

ఆగస్టు, 2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేషనల్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీని లాంచ్‌ చేశారు. ఈ పాలసీ తీసుకురావడం వల్ల కాలుష్యాన్ని కలిగించే వాహనాలను మార్కెట్‌ నుంచి తొలగించే అవకాశం లభిస్తుందని, అలాగే సర్క్యూలర్‌ ఎకానమిని ప్రమోట్‌ చేస్తుందన్నారు మోదీ. ఈ కొత్త స్క్రాప్‌ పాలసీ ద్వారా.. తమ పాత వాహనాన్ని స్క్రాపింగ్‌ చేసి కొత్త కారు లేదా కమెర్షియల్‌ వెహికల్‌ కొంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రోడ్‌ ట్యాక్సులో 25 శాతం మేర రిబేట్‌ కల్పించనున్నాయి. ఈ స్క్రాప్‌ పాలసీ ఏప్రిల్‌ 1, 2022 నుంచి అమలులోకి వచ్చింది. బడ్జెట్‌ 2021–22లో ఈ వెహికల్‌ స్క్రాప్‌ పాలసీని ప్రకటించింది కేంద్రం. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల వ్యాలిడిటీ తర్వాత ఫిట్‌నెస్‌ టెస్ట్‌ చేయనున్నారు. అలాగే కమెర్షియల్‌ వెహికల్స్‌ అయితే 15 ఏళ్ల తర్వాతనే ఫిట్‌నెస్‌ టెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు