ఇన్వెస్టర్లకు బంపర్‌ ఆఫర్‌.. ఒక షేర్‌ కొంటే మరొకటి ఉచితం.. ఇంకా రెండ్రోజులే ఛాన్స్‌..

లక్షను రూ.5 లక్షలు చేసిన స్టాక్‌ ఇదే!

(మార్కెట్‌కబుర్లు, హైదరాబాద్‌):
స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు నిజంగా ఇది బంపర్‌ ఆఫరే. ఈ కంపెనీ స్టాక్‌ కొనుగోలు చేస్తే బోనస్‌ షేర్లు అందనున్నాయి. బోనస్‌ షేర్ల జారీ రికార్డ్‌ తేదీ సెప్టెంబర్‌ 13గా నిర్ణయించింది. అంటే ఇంకో రెండు రోజులో అవకాశం. ఈలోపు 1 షేరు కొంటే మరో షేరు ఉచితంగా అందనుంది. అంతే కాదు ఈ స్టాక్‌ ఐదేళ్లలోనే లక్ష రూపాయలను రూ.5 లక్షలకుపైగా చేసింది. మరి ఆ స్టాక్‌ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

స్మాల్‌ క్యాప్‌ కేటగిరి ఫైనాన్స్‌ సెక్టార్‌ కంపెనీ అయిన మోనార్క్‌ నెట్వర్త్‌ క్యాపిటల్‌ తమ షేర్‌ హోల్డర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తమ వాటాదారులకు 1:1 రేషియోలో బోనస్‌ షేర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ బోనస్‌ షేర్ల జారీకి సంబంధించి రికార్డు తేదీని సెప్టెంబర్‌ 13గా నిర్ణయించింది. అంటే ఇంకో రెండు రోజులే ఉంది. ఈ తేదీలోపు షేర్లు కొన్న వారికి ఉచితంగా షేర్లు రానున్నాయి. ఈ కంపెనీ స్టాక్‌ గతేడాదిలో 160 శాతం లాభాలు అందించి మల్టీబ్యాగర్‌ స్టాక్‌గా నిలిచింది.

కంపెనీ ఎక్సే్చంజ్‌ ఫైలింగ్‌ ప్రకారం.. కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో 1:1 రేషియోలో బోనస్‌ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. అంటే రికార్డు తేదీ నాటికి రూ. 10 ముఖ విలువ కలిగిన 1 ఈక్విటీ షేరు కలిగి ఉన్న వారికి అదనంగా రూ. 10 ఫేస్‌ వ్యాల్యూ గల మరొక ఈక్విటీ షేరు బోనస్‌గా లభించనుంది. ఈ బోనస్‌ షేర్ల జారీకి అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు సెప్టెంబర్‌ 13, 2024ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 27వ తేదీ నాటికి ఈ బోనస్‌ షేర్లను డీమ్యాట్‌ ఖాతాల్లో క్రెడిట్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

మోనార్క్‌ నెట్వర్త్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ స్టాక్‌ కొనుగోలు చేయాలని బై రేటింగ్‌తో పాటు కొత్త టార్గెట్‌ ప్రైజ్‌ ఇస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రామచంద్రన్‌ సూచించారు. ఈ కంపెనీ షేరుకు రూ. 945 టార్గెట్‌ ప్రైజ్‌ ను ఇస్తున్నట్లు మరో అనలిస్టు వీఎల్‌ఏ అంబాలా వెల్లడించారు. రూ. 880 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలని కోరారు.

నేటి ట్రేడింగ్‌ ఇలా..
ఇవాళ్టి స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సెషన్స్‌ లో మోనార్క్‌ నెట్వర్త్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ షేరు ఈ వార్త రాసే సమయానికి సుమారు 2.52 శాతం లాభంతో రూ. 896.60 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. అయితే ఒక దశలో 10 శాతానికిపైగా పెరిగి సరికొత్త గరిష్ఠ స్థాయి రూ. 921ని తాకింది. ఈ స్టాక్‌ 52 వారాల కనిష్ఠ ధర రూ. 308.95 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 6 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 29 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 53 శాతం లాభాలు ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఈ షేరు 160 శాతం మేర రిటర్న్స్‌ అందించింది. గత ఐదు సంవత్సరాల కాలంలో 418 శాతం లాభాన్ని ఇచ్చింది. అంటే లక్ష రూపాయలను రూ.5.18 లక్షలకుపైగా చేసింది. తమ వాటాదారులకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 3530 కోట్లుగా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు