10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలని ఉందా?.. మ్యూచువల్‌ ఫండ్స్‌తోనే సాధ్యం.. ఇలా పెట్టుబడి ప్లాన్‌తో..

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):
మీరు తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీరు 10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు. అది సాధ్యమే. మీ పెట్టుబడిని మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌ ప్లాన్‌తో కొనసాగించడం. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

వడ్డీకి వడ్డీ..
కోటీశ్వరులు కావాలాని అందరూ కలలుగంటారు. కానీ, అందుకు తగిన విధంగా పెట్టుబడులు పెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ సమయంలోనే కోటీశ్వరులు అయ్యేందుకు ప్రస్తుతం ఉన్న పెట్టుబడి మార్గాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సరైన మార్గంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంత కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ హైరిటర్న్‌ ్స ఇస్తున్నాయి. దీంతో చాలా మంది తమ డబ్బులను వీటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. మీరు చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్‌ చేసి ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవాలనుకుంటే మ్యూచువల్‌ ఫండ్‌ సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఎంచుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలం పాటు మీరు పెట్టుబడిని కొనసాగిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందులో కాంపౌండింగ్‌ మ్యాజిక్‌ పని చేస్తుంది. వడ్డీపైన వడ్డీ లభిస్తుంది.

మీరు 10 సంవత్సరాలలోనే కోటీశ్వరులు కావాలనుకుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ పెట్టుబడిని ఎంచుకుని సరైన పోర్ట్‌ఫోలియో ద్వారా నెల నెలా జమ చేయాల్సి ఉంటుంది. 10 ఏళ్ల పాటు జమ చేసినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మీకు వార్షిక రాబడి సగటున 13 శాతం వస్తుందని అంచనా వేద్దాం. అప్పుడు మీరు అనుకున్న రూ.1 కోటి లక్ష్యం చేరుకువాలంటే నెలకు రూ.81,950 వరకు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు 10 ఏళ్ల తర్వాత మీ చేతికి రూ. 98.35 లక్షలకుపైగా అందుతాయి. ఒక వేళ మీకు 14 శాతం సగటు వార్షిక రాబడి అందుతుందని అంచనాలుంటే అప్పుడు మీరు నెలకు రూ.77,200 వరకు ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది. దీంతో మీ చేతికి రూ.92 లక్షలకుపైగా అందుతాయి. రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 15 శాతంగా ఉందనుకుంటే.. నెలకు రూ. 72 వేల 700 సిప్‌ పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ. 87 లక్షలు అవుతుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు