బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నాలుగు రోజుల పాటు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు ఇవాళ దిగివచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త స్తబ్దుగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆగస్టు నెలలో ఏకంగా 10.6 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు సెప్టెంబర్ 18వ తేదీన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర తులంపై రూ.150 తగ్గడంతో రూ.68 వేల 800 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ఢిల్లీలో రూ.110 తగ్గి రూ. 75040 వద్ద ఉంది.









