హమ్మయ్యా.. వరుసగా పడిపోతున్న బంగారం ధరలు… తులం గోల్డ్ ప్రస్తుతం ఎంత ఉందంటే?..

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):

ఊహించని విధంగా పసిడి రేట్లు పడిపోతున్నాయి. ఇటీవల ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు వరుసగా భారీగా పెరుగుతూ చుక్కలు చూపించాయి. అయితే ఇప్పుడు ఊహించని విధంగా పసిడి రేట్లు పడిపోతున్నాయి.

ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ అదే విధంగా దేశీయంగా కూడా రేట్లు తగ్గుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ రేటు ఔన్సుకు 2,550 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒక దశలో ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత 2,590 డాలర్ల వద్ద జీవన కాల గరిష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. మళ్లీ ప్రాఫిట్‌ బుకింగ్‌ నేపథ్యంలో భారీగా దిగొచ్చాయి. ఇదే సమయంలో స్పాట్‌ సిల్వర్‌ కూడా 30 డాలర్ల దిగువకు పడిపోయింది. రూపాయి విలువ కాస్త మెరుగైంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ. 83.708 వద్ద ఉంది.

దేశీయంగా గోల్డ్‌ రేట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 22 క్యారెట్లకు చెందిన బంగారం రేటు రూ. 150 పడిపోయి తులం రూ. 68,500 కు దిగొచ్చింది. కిందటి రోజు కూడా రూ. 150 పడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు మాత్రం భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక 24 క్యారెట్స్‌ స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు విషయానికి వస్తే.. ఇది రూ. 160 పతనంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 74,730 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాగే బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ కూడా వరుసగా రూ. 150, రూ. 160 తగ్గింపుతో 22, 24 క్యారెట్ల తులం గోల్డ్‌ రేట్లు వరుసగా రూ. 68,650; రూ. 74,880 వద్ద ఉన్నాయి.

బంగారం ధరల బాటలోనే సిల్వర్‌ రేట్లు కూడా దిగొస్తున్నాయి. ఢిల్లీలో వెండి ధర ఒక్కరోజే మళ్లీ రూ. 1000 పడిపోగా కేజీకి ఇప్పుడు రూ. 91 వేల మార్కుకు చేరింది. అంతకుముందు రోజు కూడా రూ. 1000 దిగొచ్చింది. అంతకుముందు వారంలోనే రూ. 8 వేలు పెరగడం గమనార్హం. హైదరాబాద్‌ నగరంలో కూడా రూ. 1000 పతనమైన వెండి ధర ప్రస్తుతం కేజీకి రూ. 96 వేల మార్కు వద్ద ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు