హైదరాబాద్‌లో ఇళ్లు చాలా కాస్ట్‌లీ గురూ.. అనరాక్‌ ఒక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: అమ్మకాలు తగ్గినా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2 నుంచి 25 శాతం పడిపోయినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ ఒక నివేదికలో తెలిపింది.

ఇదే సమయంలో ఈ నగరాల్లో ఇళ్ల కనీస ధరలు సగటున 23 శాతం చొప్పున పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్‌లో 12,735 యూని ట్ల నివాస గృహాలు అమ్ముడుపోయాయి. గత ఏడా ది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ. ఇదే సమయంలో అమ్మకాలు తగ్గినా, భాగ్యనగరంలో ఇళ్ల ధరలు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస గృహాల్లో ఎఫ్‌ఎఫ్‌టీ సగటున రూ.7,150 పలుకుతోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువని అనరాక్‌ తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు