ఈ ‘జువెలరీ స్టాక్‌’ మీ దగ్గరుందా?.. ఏడాదికే లక్షకు రూ.6 లక్షలు.. 1 షేరుకు 10 షేర్లు ఫ్రీ..

స్మాల్ క్యాప్ కేటగిరి జువెలరీ సెక్టార్ స్టాక్ పీసీ జువెలర్స్ లిమిటెడ్ (PC Jewellers Ltd) వాటాదారులకు శుభవార్త అందించింది. సెప్టెంబర్ 30, 2024 రోజున జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. స్టాక్ స్ప్లిట్ చేపట్టనుందని వార్తలు వచ్చిన క్రమంలో గత కొన్ని ట్రేడింగ్ సెషన్లుగా ఈ స్టాక్ వరుస అప్పర్ సర్క్యూట్లు తాకుతూ వస్తోంది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి స్టాక్ స్ప్లిట్ చేపడుతుండడం గమనార్హం. ఈ కంపెనీ షేరు గత ఏడాదిలోనే ఏకంగా 546 శాతం మేర లాభాలు అందించి మల్టీబ్యాగర్ స్టాక్‌గా అవతరించింది. ఈ పీసీ జువెలర్స్ లిమిటెడ్ స్టాక్‌ నిపుణులు ఇంకా ఏం చెబుతున్నారంటే..

కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 61 ప్రకారం.. 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది. అంటే రూ. 10 ఫేస్ వ్యాల్యూ గల ఒక ఈక్విటీ షేరును రూ. 1 ఫేస్ వ్యాల్యూ గల 10 షేర్లుగా విభజించనుంది. అయితే దీనికి సంబంధించి రికార్డు తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. రికార్డ్ తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్న వారికి మాత్రమే స్టాక్ స్ప్లిట్‌కి అర్హత ఉంటుంది.

గురువారం అక్టోబర్ 3వ తేదీ ట్రేడింగ్ సెషన్ గమనిస్తే పీసీ జువెలర్స్ లిమిటెడ్ షేరు ధర 1.75 శాతం లాభంతో రూ.172.20 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 187.07 వద్ద ఉండగా.. అలాగే 52 వారాల కనిష్ఠ ధర రూ. 25.45 వద్ద ఉంది. గత వారంలో ఈ షేరు 11 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో ఈ షేరు 54 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ షేరు 188 శాతం రాబడిని అందించింది. గత ఏడాది కాలంలో ఈ షేరు ఏకంగా 557 శాతం లాభాలు ఇచ్చింది. అంటే ఏడాది క్రితం లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ.6.57 లక్షలకుపైగా వచ్చినట్లయింది. ఇక గత ఐదు సంవత్సరాలలో 440 శాతం లాభాన్ని తమ వాటాదారులకు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.8,030 కోట్లుగా ఉంటుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు