(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్):
ఈ మధ్యకాలంలో రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. అందుకే చాలా మంది ముందుచూపుతో బంగారం పై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. కొంతమంది మాత్రం బడ్జెట్ ప్రాబ్లంతో పెట్టుబడులు పెట్టలేకపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈ శుభవార్త. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా. అయితే తెలుసుకుందాం పదండి.
ఇప్పుడు PhonePe Micro Savings Platform Jar సహకారంతో ప్రతిరోజు పొదుపు చేసుకునే సరికొత్త అవకాశం వచ్చేసింది. ఈ ప్లాన్ ద్వారా చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టి ప్రతి రోజు 24 క్యారెట్ల డిజిటల్ బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. దీనికోసం వినియోగదారులు కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.5,000లను పెట్టుబడి పెట్టవచ్చు.
పొదుపు చేసుకునే మార్గం..
Phone Pay in app Category Head నిహారిక సైగల్ మాట్లాడుతూ ఈ ప్లాట్ ఫారం ద్వారా కాలంలో డిజిటల్ గోల్డ్ గణనీయంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఈ మేరకు ‘డైలీ సేవింగ్స్‘ అనే కొత్త పథకాన్ని Phone Pay ప్రారంభించిందన్నారు. దీని ద్వారా చిన్నమొత్తంలో కూడా వినియోగదారులు బంగారం పై పెట్టుబడి పెట్టవచ్చని తెలిపారు.









