గుడ్‌న్యూస్.. వరుసగా దిగొస్తున్న బంగారం ధర.. తులం ఎంతంటే?

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):

పండుగ ఏదొచ్చినా.. శుభకార్యం ఏదైనా.. మహిళలకు మొదటిగా గుర్తొచ్చేది బంగారమే. ఈ తరుణంలోనే అటు మహిళలకు, ఇటు మదుపరులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత రెండు రోజులుగా తగ్గుతూవస్తోన్న బంగారం ధర.. శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టింది. దసరా ముందు బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

శుక్రవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 76,630లు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240గా నమోదైంది. ఇటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 76,780గా, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,390గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 76,630గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240గా కొనసాగుతోంది.

బంగారం బాటలోనే వెండి..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శుక్రవారం రూ. 100 మేరకు తగ్గి కేజీ రూ. 93,900లుగా నిలిచింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే నగరాల్లో కిలో వెండి ధర రూ. 93,900గా ఉంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 99,900గా కొనసాగుతోంది. అటు బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ. 84,900గా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు