బంగారం, వెండి ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఎందుకంటే రెండో రోజు వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. చివరి నెల డిసెంబర్ మాసంలోని క్రిస్మస్ పండుగకు ముందు బంగారం , వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఇప్పటికే తగ్గిన ఈ ధరలు, బులియన్ మార్కెట్లో ఈరోజు (మంగళవారం) ఉదయం నాటికి పడిపోయాయి. ఈ క్రమంలో నేడు (మంగళవారం) ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 76,270కు చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే 1,170 రూపాయలు తగ్గడం విశేషం.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,914కు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,000కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 69,667కు చేరింది. ఇక వెండి ధరల గురించి మాట్లాడితే కిలో వెండి ధర రూ. 88,760గా ఉంది. ఇది నిన్నటితో పోల్చితే రెండు వేల రూపాయలు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల గురించి ఇప్పుడు చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
- హైదరాబాద్లో రూ. 76,250, రూ. 69,896
- విజయవాడలో రూ. 76,250, రూ. 69,896
- ఢిల్లీలో రూ. 76,270, రూ. 69,914
- చెన్నైలో రూ. 76,350, రూ. 69,988
- ముంబైలో రూ. 76,130, రూ. 69,786
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
- ముంబైలో రూ. 88,910
- చెన్నైలో రూ. 89,170
- బెంగళూరులో రూ. 88,980
- హైదరాబాద్లో రూ. 89,060
- విజయవాడలో రూ. 89,060
- చెన్నైలో రూ. 89,170
- విశాఖపట్నంలో రూ. 89,060
22, 24 క్యారెట్ల మధ్య తేడా మీకు తెలుసా?
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 22 క్యారెట్ల బంగారంలో 9% కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం విలాసవంతమైనది అయినప్పటికీ, దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించుకోలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారం విక్రయిస్తారు.
(మంగళవారం)









