అదిరిపోయే లుక్‌లో మారుతి కొత్త కార్లు.. 2025లో వచ్చేస్తున్నాయి

కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న సంస్థ..కొత్త ఏడాదిలో నయా మాడళ్లను విడుదల చేయబోతున్నది. ఢిల్లీ వేదికగా జరగనున్న వాహన పండుగలో ఈ కొత్త మాడళ్లను ప్రదర్శిస్తున్నది.

వీటి వివరాలు..

మారుతి ఈ-విటారా:దేశీయంగా ఈవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మారుతి కూడా ఈ మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో 17 నుంచి 22 వరకు ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో తన తొలి ఈ-విటారాను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తున్నది. 49 కిలోవాట్లు, 61 కిలోవాట్లా బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించిన ఈ కారు ధర రూ.22 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. సింగిల్‌ చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోసిస్టమ్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, 360-డిగ్రీల కెమెరా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.

నయా గ్రాండ్‌ విటారా
కాంప్యాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి నయా గ్రాండ్‌ విటారాను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వచ్చే ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టనున్న ఈ కారును సరికొత్తగా తీర్చిదిద్దినట్లు,ముఖ్యంగా ఇంటీరియర్‌ డిజైనింగ్‌, డ్యాష్‌బోర్డ్‌, ఐదు-ఏడుగురు కూర్చోవడానికి విధంగా డిజైన్‌ చేసింది.

కొత్త బాలెనో
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనోను మరింత ఆధునీకరించి విడుదల చేయడానికి సిద్ధమైంది మారుతి. మార్చి నెలలో అందుబాటులోకి రానున్న ఈ కారులో అతిపెద్ద టచ్‌స్క్రీన్‌, ఫుల్‌ డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే,సింగిల్‌-ప్యాన్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ చార్జర్‌, టైర్‌-ప్రెషర్‌ మానటరింగ్‌ సిస్టమ్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో తీర్చిదిద్దింది.

అప్‌గ్రేడ్‌ బ్రెజ్జా
మూడేండ్ల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన బ్రెజ్జాను మళ్లీ ఆధునీకరించి మార్కెట్లో విడుదల చేయబోతున్నది సంస్థ. స్కోడా కైలాక్‌, కియా సైరోస్‌ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఈ నయా మాడల్‌ను తెస్తున్నది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు