కొన్ని రోజులుగా బంగారం , వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు (డిసెంబర్ 5న) మాత్రం దేశంలో వీటి ధరల్లో పెద్దగా మార్పులేదు. ఈ క్రమంలో నేడు ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,860కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300కు చేరింది.
అదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,710కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.72,150కు చేరుకుంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా నిలకడగా ఉన్నాయి. నేడు కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ గోల్డ్ రేట్, 24 క్యారెట్ గోల్డ్ రేట్
- చెన్నైలో రూ. 72,150 రూ. 78,710
- ఢిల్లీలో రూ. 72,300 రూ. 78,860
- కోల్కతాలో రూ. 72,150 రూ. 78,710
- బెంగళూరులో రూ. 72,150 రూ. 78,710
- హైదరాబాద్లో రూ. 72,150 రూ. 78,710
- విజయవాడలో రూ. 72,150 రూ. 78,710
- ఆగ్రాలో రూ. 72,300 రూ. 78,860
- ముంబైలో రూ. 72,150 రూ. 78,710
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే ముందు మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలు కలిగి ఉండవు.









