ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు

అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్ పట్టాభిషేకానికి భారతయ కుబేరుడు ముఖేష్ అంబానీ సతీసమేతంగా హాజరవుతున్నారు. నీతా, ముఖేష్ అంబానీ జనవరి18 (శనివారం) వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

ట్రంప్ ప్రమాణస్వీకార మహాత్సవానికి రెసెప్షన్, బాణసంచా ప్రదర్శనతో వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మొదలవుతాయి. క్యాబినెట్ రెసెప్షన్, ఉపాధ్యక్షుడు ఏర్పాటు చేసే డిన్నర్‌లోనూ ‌అంబానీలు పాల్గొంటారు. ఇనాగరేషన్‌కు ముందు జరిగే క్యాండిల్‌లైట్ డిన్నర్‌లో ట్రంప్, ఉపధ్యక్షుడిగా ఎంపికైన జేడీ, ఉషా వాన్సెలతో కలిపి వీరు పాల్గొంటారు.

బిలియనీర్ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా చీఫ్ మార్క్ జుకర్‌బెర్గ్, పలువురు వ్యాపారవేత్తలు, టెక్ కంపెనీల ఓనర్స్ కూడా అమెరిలో అధ్యక్షుడి పట్టాభిషేకానికి వస్తున్నారు. ట్రంప్ గతంలో అమెరికా 45వ అధ్యక్షుడిగా 2017 నుంచి 2021 వరకూ పనిచేశారు. రెండవ సారి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి గెలిచి సోమవారం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు