* కార్మికులకు చిరు ఉద్యోగులకు వరం వంటిది
* మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి రెండింతలు
(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్)
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే లక్షల్లో కోట్లల్లో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. వంద రూపాయలు తో కూడా షేర్లు , బంగారం కొనవచ్చు. పెట్టిన పెట్టుబడులు మూడేళ్లలో రెండింతలు కావాలంటే ఈ టీ ఎఫ్ రూపంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. ఏదైనా బ్రోకరేజ్ సంస్థ నుంచి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. మన దేశంలోనే కాకుండా విదేశీ కంపెనీలు కూడా వాటాలు పొందవచ్చు. విదేశీ స్టాక్ మార్కెట్లలో కూడా ఈ ఈటీఎఫ్ ల ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. వంద రూపాయలతో షేర్లు లేదా బంగారం లేదా వెండిను కొనవచ్చు. Mon 100 అనే ఈ టీ ఎఫ్ లో ఏడాది క్రితం ₹. 100 పెట్టుబడి పెడితే అది ఇప్పుడు 180 కి పెరిగింది. దాదాపు 80 శాతం లాభాన్ని ఇచ్చింది.MON 100 అనే ఈ టీ ఎఫ్ విదేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంది.
ETFs అంటే ఏమిటి?
ETFs (Exchange-Traded Funds) అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడయ్యే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇవి స్టాక్స్, బాండ్లు, కమోడిటీస్ లేదా వీటిలో మిశ్రమంగా ఉండే ఆస్తుల పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంటాయి. అవి నిర్దిష్ట ఇండెక్స్ (ఉదా: నిఫ్టీ 50, S&P 500) పనితీరును అనుకరించడానికి డిజైన్ చేయబడ్డాయి. ETFs ని పాసివ్‌గా నిర్వహిస్తారు, అంటే ఫండ్ మేనేజర్లు తరచుగా కొనుగోలు/అమ్మకాలు చేయాల్సిన అవసరం ఉండదు. వీటిని ఫండ్ హౌస్ లే నిర్వహిస్తాయి.
ETFs ప్రయోజనాలు
ఈటీఎఫ్ లు ఒక కంపెనీ షేర్ కాదు. కొన్ని కంపెనీల షేర్లను గంపగుత్తదా కొనుగోలు చేయడమే ఈటిఎఫ్ అని చెప్పొచ్చు. ఆ కారణంగా ఒక కంపెనీ నష్టం లో ఉన్న మరో కంపెనీ లావణ్య మనకున్న ఈటీఎఫ్ నష్టాన్ని చూపదు. ఉదాహరణకు niftybees అనే ఈటీఎఫ్ లో పెట్టుబడి పెడితే మొత్తం నిఫ్టీ 50 కంపెనీలు పెట్టుబడి పెట్టినట్లు.
తక్కువ ఖర్చులు (Lower Costs):
ఇవి మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఉంటాయి, ఎందుకంటే ఇవి పాసివ్‌గా నిర్వహించబడతాయి.
3. లిక్విడిటీ (Liquidity):
ETFs ను స్టాక్ మార్కెట్లో రోజు మొత్తం కొనుగోలు/అమ్మకాలుగా ట్రేడ్ చేయవచ్చు, అందువల్ల ఇవి అధిక లిక్విడిటీని అందిస్తాయి.
4. పారదర్శకత (Transparency):
ETFs తమ హోల్డింగ్స్‌ను రోజువారీగా వెల్లడిస్తాయి, దాంతో పెట్టుబడిదారులు ఎవరేమి కలిగి ఉన్నారో తెలుసుకోగలరు.
5. అభిరుచి (Flexibility):
స్టాక్స్‌లా ట్రేడ్ చేయవచ్చు, షార్ట్ సెల్లింగ్ లేదా మార్జిన్లో కొనుగోలు చేయడం వంటి వ్యూహాలు అనుసరించవచ్చు.
భారతదేశంలో ప్రధాన 5 ETFs
1. నిప్పాన్ ఇండియా ETF నిఫ్టీ 50:
నిఫ్టీ 50 ఇండెక్స్‌ను అనుసరిస్తుంది, భారతదేశపు టాప్ 50 కంపెనీలకు ప్రాతినిధ్యం ఇస్తుంది. niftybees అనే పేరు తో ఈ etf కొనవచ్చు.
2. ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్ట్స్ 50 ETF:
నిఫ్టీ నెక్ట్స్ 50ని అనుసరిస్తుంది, నిఫ్టీ 50 తర్వాతి 50 పెద్ద కంపెనీలను కవర్ చేస్తుంది.
3. HDFC గోల్డ్ ETF:
భౌతిక బంగారపు ధరలను అనుసరిస్తుంది, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు రక్షణ అందిస్తుంది.
4. SBI ETF సెన్సెక్స్:
సెన్సెక్స్‌ను అనుకరిస్తుంది, భారతదేశపు టాప్ 30 కంపెనీలలో పెట్టుబడులు ఇస్తుంది.
5. UTI నిఫ్టీ 50 ETF:
నిఫ్టీ 50ని అనుసరిస్తుంది, తక్కువ ఖర్చుతో లార్జ్-క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు అందిస్తుంది.
NSEలో ఉన్న ETFs సంఖ్య
2024 ఆర్థిక సంవత్సరానికి, భారతదేశ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)లో మొత్తం 165 ETFs లిస్ట్ అయ్యాయి. అందులో 141 ఇక్విటీ ETFs, 24 డెట్ ETFs ఉన్నాయి.
ETFs సంఖ్య 2017 ఆర్థిక ఏడాది నుంచి ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతూ వస్తోంది.
మరిన్ని వివరాలకు NSEలో లిస్ట్ అయిన ETFs గురించి తెలుసుకోవాలంటే, NSE అధికారిక వెబ్సైట్ (nseindia.com) ను సందర్శించండి.









