గుడ్ న్యూస్.. పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఇవాళ్టి ధరలు ఇవే..

అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఇండియాలో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి.

ఈ నేపథ్యంలో నేడు జనవరి 21, 2025న) ఉదయం 6.35 గంటల నాటికి https://bullions.co.in ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 470 తగ్గి రూ. 78,620కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 431 పడిపోయి రూ. 72,068కు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 78,880గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,307 స్థాయికి చేరుకుంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి రేట్ల విషయానికి వస్తే నేడు ఢిల్లీలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర 90 రూపాయలు తగ్గి రూ. 91,290కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడలో కూడా కేజీ వెండి రేటు రూ. 90 తగ్గి రూ. 91,590కి చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ గోల్డ్ ధరలు

  • ముంబైలో రూ. 72,197 రూ. 78,760
  • కోల్‌కతాలో రూ. 72,096 రూ. 78,650
  • చెన్నైలో రూ. 72,408 రూ. 78,990
  • హైదరాబాద్‌లో రూ. 72,307 రూ. 78,880
  • విజయవాడలో రూ. 72,307 రూ. 78,880
  • ఢిల్లీలో రూ. 72,068 రూ. 78,620
  • బెంగళూరులో రూ. 72,252 రూ. 78,820

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు