అగ్రరాజ్య కుబేరుడు మన ట్రంప్.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలిస్తే షాకే..

(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్)

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు.   అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ సంచలనం. అంతకంటే ముందు ఆయన బిజినెస్‌ రంగాన్ని ఏలారు. చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టి, భారీ లాభాలు సంపాదించారు. సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ నెట్‌వర్త్‌ జనవరి 20 నాటికి $6.7 బిలియన్లు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, ట్రంప్ సంపద రియల్ ఎస్టేట్, మీడియా, టెక్నాలజీ వంటి విభిన్న రంగాల నుంచి వస్తుంది.

2024 అక్టోబర్ నాటికి డోనాల్డ్ ట్రంప్ నికర సంపద విలువ సుమారు $6.6 బిలియన్ నుంచి $7.7 బిలియన్లుగా ఉండొచ్చని అంచనా. భారత కరెన్సీ ప్రకారం.. ఈ విలువ సుమారు రూ.55,519 కోట్లు ఉంటుంది. ట్రంప్ ఆస్తుల విలువ $8 బిలియన్ల వరకు ఉండవచ్చని మరొక నివేదిక పేర్కొంది. ఇది దాదాపు రూ.66,640 కోట్లకు సమానం.

* రియల్ ఎస్టేట్‌ కీలకం
ట్రంప్ అదృష్టం ప్రధానంగా రియల్ ఎస్టేట్‌తో ముడిపడి ఉంది. ఇది తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారం. ఫ్రెడ్ న్యూయార్క్‌లోని సక్సెస్‌ఫుల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌లో ఒకరు. ఆయన వారసత్వాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ మరింత ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుదల, ఎక్కువ మంది వ్యక్తులు ఇంటి నుంచి పని చేయడం వంటి మార్పులతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆఫీసు బిల్డింగులు, షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటికి డిమాండ్‌ తగ్గుతోంది.

* ట్రంప్‌ లగ్జరీ ప్రాపర్టీస్, అస్సెట్స్
ట్రంప్ పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల లగ్జరీ ప్రాపర్టీస్, అస్సెట్స్ ఉన్నాయి.
1. 58 బెడ్‌రూమ్స్, 33 బాత్‌రూమ్స్, 12 ఫైర్‌ప్లేస్‌లు, స్పా, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్‌తో 20 ఎకరాల విస్తీర్ణంలో $10 మిలియన్ల విలువచేసే భవనం ఉంది.
2. న్యూయార్క్, మాన్హాటన్, సెయింట్ మార్టిన్, వర్జీనియాలో లగ్జీరియస్‌ హోమ్స్ ఉన్నాయి.
3. ట్రంప్‌కి  బోయింగ్ 757 విమానం ఉంది. దీన్ని ‘ట్రంప్ ఫోర్స్ వన్’ అని పిలుస్తారు.
4. గోల్ఫ్ కోర్సులు, వైనరీ, ఇతర అధిక-విలువ ఎస్టేట్స్ ట్రంప్‌ సొంతం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు