చుక్కలు చూయిస్తున్న గోల్డ్ రేట్లు.. తులం ఎంతంటే?

బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ రూ. 600 పెరగ్గా 22 క్యారెట్లకు తులం రూ. 74,500 కు చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు చూస్తే రూ. 81,270 వద్దకు చేరింది. మరోవైపు వెండి రేట్లు కూడా పెరిగాయి. తాజాగా రూ. 1000 పెరగ్గా కిలోకు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ. 1.04 లక్షలకు ఎగబాకింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే.. గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశీయంగా ఆభరణ వర్తకులు, స్టాకిస్టులు కొనగోళ్లు పెంచడం కూడా వీటి ధరల పెరుగుదలకు కారణమయ్యాయని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 10.20 డాలర్లు పెరిగి 2,769.40 డాలర్ల వద్ద ట్రేడవగా.. వెండి 0.27 శాతం పెరిగి 31.58 డాలర్లు పలికింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు