వాహన కొనుగోలుదారులకు షాక్.. మారుతి కార్ల ధరలకు రెక్కలు..

కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ.. నూతన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అన్ని రకాల వాహన ధరలను రూ.32,500 వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.

ప్రస్తుతం సంస్థ రూ.3.99 లక్షల ప్రారంభ ధర కలిగిన ఆల్టో కే-10తోపాటు రూ.28.92 లక్షల గరిష్ఠ ధర కలిగిన ఇన్విక్టో మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వాహన ధరల పెంపు ఇలా..

  • కాంప్యాక్ట్‌ కార్‌ సెలేరియో రూ.32,500 వరకు పెరగనున్నది.
  • ప్రీమియం మాడల్‌ ఇన్విక్టో రూ.30 వేల వరకు అధికంకానున్నది.
  • మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్‌-ఆర్‌ మాడల్‌ రూ.15 వేల వరకు ప్రియం కానున్నది.
  • స్విఫ్ట్‌ మాత్రం రూ.5 వేల వరకు పెరగనున్నది.
  • ఎస్‌యూవీ మాడళ్లు బ్రెజ్జా రూ.20 వేలు, గ్రాండ్‌ విటారా రూ.25 వేలు ప్రియంకానున్నాయి.
  • ఎంట్రీ లెవల్‌ స్మాల్‌ కారు ఆట్లో కే10 రూ.19,500, ఎస్‌-ప్రెస్‌ రూ.5 వేలు పెరగనున్నది.
  • ప్రీమియం కాంప్యాక్ట్‌ మాడల్‌ బాలెనో రూ.9 వేల వరకు అధికమవనుండగా, కాంప్యాక్ట్‌ ఎస్‌యూవీ ఫాంక్స్‌ రూ.5,500, కాంప్యాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు