జర్నలిస్టు దిగ్గజం, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత..

జర్నలిస్టు దిగ్గజం,  ఉద్యమ కెరటం,  మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆర్‌ సత్యనారాయణ (Satyanarayana) కన్నుమూశారు.   కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా, టీజీపీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీఎస్‌పీస్సీ సభ్యుడిగా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుగా, ఎమ్మెల్సీగా, టీజీపీఎస్సీ సభ్యుడిగా తనదైన ముద్రవేశారన్నారు. బీఆర్‌ఎస్‌కు ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.

సత్యనారాయణ మృతిపట్ల మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు