సాఫ్ట్‌వేర్ జాబ్ వేదిలేసి.. ఫిష్ బిర్యానీ అమ్ముతూ.. నెలకు రూ.లక్షా 50 వేలు సంపాదిస్తున్న యువకుడు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటేనే లక్షల్లో సంపాదన.. కారు, బంగ్లా, మంచి జీతం కానీ ఇవేమి తనకు సంతృప్తిని ఇవ్వలేదు. ఉన్న ఊర్లో ఏదైనా సొంత వ్యాపారం పెట్టుకొని సొంత కాళ్లపై రాణించాలనుకుని ఫిష్ బిర్యానీ ఫుడ్ రంగంలో అడుగుపెట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు కరీంనగర్ కు చెందిన శివ అనే యువకుడు. బీటెక్ చేసిన శివ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు.

11 లక్షల ప్యాకేజీ తో బెంగళూరులో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడు. కరోనా తర్వాత ఇంటి వద్ద ఉన్నప్పుడు హోటల్ కి వెళ్లి బిర్యానీ తినడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఎక్కడ కూడా ఫిష్ బిర్యానీ దొరకక పోవడంతో తాను ఎందుకు ఫిష్ బిర్యానీ పెట్టకూడదని ఆలోచనతో తెలంగాణ ఫిష్ జాతీయ అభివృద్ధి మత్స్యకార బోర్డు ఆర్థిక సాయంతో మహాదేవ్ ఫిష్ ఫుడ్ కోర్ట్ ను   రెండు సంవత్సరాల క్రితం కరీంనగర్ లో నెలకొల్పానని నిర్వాహకుడు శివ  వివరించారు.

ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. మానేరు నది తీరాన దొరికే లైవ్ ఫిష్.. బొమ్మలు,రవ్వలు, అపోలో ఫిష్, ఇతర ఫిష్లను తీసుకొచ్చి ఇంటిదగ్గర వీటిని రెడీ చేసి ఫిష్ బిర్యానీ, ఫిష్ కర్రీ, ఫిషి దమ్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, చేసుకొచ్చి  ఇక్కడ అమ్ముతున్నామని నిర్వాహకుడు శివ తెలిపారు.. ఇక్కడ కూడా నెలకు సుమారు లక్షల 50 వేలపైనే సంపాదిస్తున్నానని సందర్భంగా పేర్కొన్నారు.

ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఫుడ్ కోర్ట్ నడుస్తుంది అన్నారు. ఇక్కడ 80 రూపాయలు మొదలుకొని 200 రూపాయల వరకు వివిధ రకాలైన ఫిష్ బిర్యానీలు అమ్ముతున్నారు. మానేరు నది చూడానికి వచ్చే పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఈ ఫిష్ బిర్యానీ తింటున్నారు. మీరు కూడా ఎప్పుడైనా కరీంనగర్ వస్తే ఈ ఫిష్ బిర్యానీ తినడం మర్చిపోకండి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు