వరుసగా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్స్.. ఒక్కసారిగా దడపుట్టించాయి. గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్‌మనేలా.. ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. ఏకంగా రూ. 860 మేరకు పెరిగింది బంగారం ధర. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,960గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా కొనసాగుతోంది. బంగారం ధర ఇలా ఉంటే.. అటు వెండి ధర నేలచూపులు చూస్తోంది. స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు.. ఇవాళ రూ. 100 మేరకు తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,960 ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,960గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,860గా ఉంది.
వెండి ధరలు ఇలా..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 96,400 ఉండగా.. కోల్‌కతా, బెంగళూరు, ముంబై నగరాల్లోనూ ఇదే రేటు కొనసాగుతోంది. అటు హైదరాబాద్, చెన్నై, కేరళ, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కేజీ వెండి ధర లక్ష దాటేసింది. ప్రస్తుతం రూ. 1,03,900 దగ్గర కొనసాగుతోంది. కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.









