వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌.. చరిత్ర సృష్టించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరో చరిత్ర సృష్టించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను   ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. శనివారం ఉదయం 11 గంటలకు  నిర్మలా సీతారామన్‌  లోక్‌సభ లో ప్రవేశ పెట్టారు. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించి  చరిత్ర సృష్టించారు.

2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్‌, ఏడు పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించిన విషయం తెలిసిందే. ఇవాళ సమర్పించిన బడ్జెట్‌ ఎనిమిదవది. ఈ బడ్జెట్‌తో వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్‌తో మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్‌ 10 బడ్జెట్‌ల రికార్డుకు నిర్మలమ్మ చేరువయ్యారు. అంతేకాదు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేశారు.

పది బడ్జెట్లతో మొరార్జీ దేశాయ్‌ రికార్డు

కేంద్ర ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ 1959-1964 మధ్య ఆరు, 1967-1969 మధ్య నాలుగు బడ్జెట్‌లు సమర్పించారు. తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ, లాల్‌ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంల్లో బడ్జెట్‌లు సమర్పించారు. 1959 ఫిబ్రవరి 28న తొలిసారి బడ్జెట్‌ సమర్పించారు. అటుపై 1962లో ఇంటరిం బడ్జెట్‌, తిరిగి రెండు వార్షిక బడ్జెట్‌లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. నాలుగేండ్ల తర్వాత 1967లో ఇంటరిం బడ్జెట్‌, 1967-1969 మధ్య మూడు వార్షిక బడ్జెట్‌లు సమర్పించారు. ఇక మాజీ ఆర్థిక మంత్రులు పి చిదంబరం 9 బడ్జెట్‌లు, ప్రణబ్‌ ముఖర్జీ 8 బడ్జెట్‌లను సమర్పించారు.

తొమ్మిది బడ్జెట్‌లు సమర్పించిన చిదంబరం

వేర్వేరు సమయాల్లో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తొమ్మిది బడ్జెట్‌లను పార్లమెంట్‌కు సమర్పించారు. తొలిసారి 1996 లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌ సమర్పించారు. హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా ఉండగా 1996 మార్చి 19న తొలి బడ్జెట్‌ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. తిరిగి 1997లో బడ్జెట్‌ సమర్పించారు. 2004-08 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. కొంత కాలం హోంమంత్రిగా పని చేసిన చిదంబరం.. తిరిగి 2013, 2014లో బడ్జెట్‌ సమర్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు