కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ దెబ్బకు చరిత్రలో మొదటిసారి..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెషన్లలోనే సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోయి 76,791 కి పడిపోయింది. నిఫ్టీ 236పాయింట్లు తగ్గి 23,246కి క్షీణించింది. సూచీల క్షీణతతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్ల నుంచి రూ.419 లక్షల కోట్లకు క్షీణించింది. ఇన్వెస్టర్ల సంపద రూ.5లక్షల కోట్లు ఆవిరైంది. ఈరోజు మార్కెట్ల నష్టాలకు ముఖ్యంగా 5 కారాణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కెనడా, మెక్సికో, చైనా పై టారిఫ్లు పెంచుతామని ఆయన చేసిన ప్రకటనతో ఆసియా మార్కెట్లు సోమవారం నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ సూచీ, కోరియా కోస్పిసూచీలు 3 శాతం తగ్గాయి. చరిత్రలోనే తొలిసారి డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 87 కు క్షీణించింది. ట్రంప్ టారిఫ్లు విధిస్తానని చేస్తున్న ప్రకటనలో డాలర్ విలువ అంతకంతకూ బలపడుతోంది.

సెన్సెక్స్‌లో పీఐ ఇండస్ట్రీస్, నైకా, యూపీఎల్, టీవీఎస్ మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హుడ్కో, మదర్సన్, సైమన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 725 పాయింట్ల నష్టాంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 479 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ ప్రస్తుతానికి 87.16గా ఉంది.

 భారీగా పతనమవుతున్న రుపాయి విలువ..

డాలర్ ఇండెక్స్ తగ్గకపోతే ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీసే అవకాశం టారిఫ్‌లకు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. మున్ముందు చాలా దేశాలు నష్టాల బాట పడతాయని నిపుణులు అంటున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే రూపాయి విలువ పతనం అవుతుంంది. ఎక్కువగా డాలర్‌పై ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలో పతన మవుతున్నాయి. చరిత్రలో మొదటిసారి రూపాయి విలువ రూ.87కి పడిపోయింది. ప్రస్తుతం డాలర్‌తో చూస్తే రూపాయి విలువ రూ. 87.16 వద్ద ట్రేడవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు