మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనాల‌నుకునే వారికి గుడ్ న్యూస్‌. ఈ రోజు బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఇటీవ‌ల బంగారం ధ‌రలు భారీగా పెర‌గ‌డంతో కాస్త నిరాశ చెందిన ప్ర‌జ‌ల‌కు.. ఈ రోజు రేట్లు త‌గ్గ‌డంతో కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌న‌ట్లు అయింది.

గ‌త రెండు రోజులుగా బంగారం ధ‌ర‌ కాస్త త‌గ్గుతూ వ‌స్తోంది. నిన్న‌ హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల ప‌ది గ్రాముల‌ బంగారం ధర రూ.84,490 ఉండ‌గా.. నేడు తులానికి (10 గ్రాములు) 440 రూపాయ‌లు త‌గ్గి.. రూ.84,050 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ఇక‌, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై కూడా 400 రూపాయ‌లు తగ్గింది. నిన్న ప‌ది గ్రాముల‌కు రూ.77,450 ఉండ‌గా.. నేడు 400 రూపాయలు త‌గ్గి రూ.77,050 వ‌ద్ద‌ కొన‌సాగుతోంది.

ఇక 18 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్న రూ.63,370గా ఉండగా.. నేడు 330 రూపాయలు త‌గ్గి రూ.63,040 వద్ద కొనసాగుతోంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు