షాకింగ్.. వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలుసా..

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం అంటేనే బెంబేలెత్తిపోయేలా ధరలు పెరుగుతున్నాయి. గోల్డ్ రేటు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టడంతో గోల్డ్ కు డిమాండ్ పెరుగుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కావడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. రూపాయి విలువ సోమవారం 88 లెవెల్ వరకు తగ్గింది. చివరికి కొంచెం బలపడి 87.45 దగ్గర సెటిలైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడంతో గోల్డ్ కు ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి.

ఈనెల 4వ తేదీ నుంచి బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఇవాళ పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటే.. గడిచిన ఎనిమిది రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై సుమారు రూ.4వేలు పెరిగింది. అయితే, ప్రస్తుతం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.87,930కు చేరింది. 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ.80,600 రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈనెల 6వ తేదీ నుంచి వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు