కొంత కాలంగా క్రమేపీ పెరుగుతున్న బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. నేడు (21-02-2025) ఉదయం 6.30కు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర నిన్నటి రేట్లతో పోలిస్తే రూ.10 మేర పెరిగి రూ.88,200కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.80,860 వద్ద తచ్చాడుతోంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు మొగ్గు చూపడంతో ధరలకు రెక్కలొచ్చాయి. గతంలోలా భారీ స్థాయిలో మార్పులు లేకపోయినా క్రమంగా రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక వెండి ధరలో మాత్రం నిన్నటితో పోలిస్తే తగ్గుదల కనిపించింది. నిన్న కేజీ వెండి ధర రూ.1,00,500 కాగా నేడు అది రూ.100 తగ్గి రూ. 1,00,500కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గడం గమనార్హం.
ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 కు పెరిగి రూ.80,700 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 కు పెరిగి రూ.88,040 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,08,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.80,700
24 క్యారెట్ల బంగారం ధర – రూ.88,040
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.80,700
24 క్యారెట్ల బంగారం ధర – రూ.88,040









