హెచ్‎సీఎల్ ఫౌండర్ కీలక ప్రకటన.. మహిళా దినోత్సవం వేళ కుమార్తెకు భారీ గిఫ్ట్

ప్రముఖ టెక్ సంస్థ HCL వ్యవస్థాపకుడు, బిలియనీర్ శివ్ నాడార్(Shiv Nadar), తన వ్యూహాత్మక వారసత్వ ప్రణాళికలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, HCL కార్ప్, వామా ఢిల్లీ సంస్థల్లో 47% వాటాను తన కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రాకు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయం నాడార్ కుటుంబానికి, HCL గ్రూప్‌కి ఒక కొత్త దశను సూచిస్తుంది. HCL టెక్నాలజీస్ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీగా కొనసాగుతోంది.

వ్యూహాత్మక వారసత్వ ప్లాన్

శివ్ నాడార్, 1976లో HCLని స్థాపించారు. ఆ తర్వాత ఈ సంస్థను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆయన కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా, HCL టెక్నాలజీస్ ప్రస్తుత ఛైర్‌పర్సన్‎గా ఉన్నారు. ఈ 47% వాటా బహుమతితో, ఆమెకు సంస్థలో మరిన్ని అధికారాలు, నియంత్రణ అవకాశాలు లభిస్తాయి. ఈ నిర్ణయం శివ్ నాడార్ వ్యూహాత్మక వారసత్వ ప్రణాళికలో భాగంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. నాడార్ కుటుంబం, HCL గ్రూప్‌ను భవిష్యత్తులో కూడా విజయవంతంగా కొనసాగించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రోష్ని నాడార్ మల్హోత్రా, ఇప్పటికే HCLలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ కొత్త బాధ్యతలు ఆమెకు మరిన్ని అవకాశాలను అందిస్తాయి.

మహిళా దినోత్సవం సందర్భంగా..

ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకోవడం విశేషం. ఇది మహిళల శక్తిని, నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పవచ్చు. శివ్ నాడార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ క్రమంలో వారి శక్తిని గుర్తించి, ప్రోత్సహించడం చాలా అవసరమని వెల్లడించారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు