మార్కెట్ ని షేక్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు .. అతివలు మెచ్చినవి ఇవే..!

ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఈవీ వాహనాల జోరు పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఈవీ స్కూటర్ల వెర్షన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే విరివిగా దొరికే ఈ స్కూటర్స్‌లో ఏ స్కూటర్ ఎంచుకోవాలనే అనుమానం అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్స్‌లో మహిళలు ఎక్కువగా ఇష్టపడే స్కూటర్లపై ఓ లుక్కేద్దాం.

ఒడిస్సే రేసర్ లైట్ వీ2 /వీV2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.71,250 నుంచి రూ.94,450 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. రేసర్ లైట్ వీ2 విషయానికి వస్తే శక్తివంతమైన, వాటార్ రెసిస్టెంట్ మోటారుతో వస్తుంది. అలాగే లిథియం-అయాన్ బ్యాటరీ మూడు-నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ 75 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ లైట్లు, పెద్ద బూట్ స్పేస్ ఆకట్టుకుంటాయి. ఒడిస్సే రేసర్ లైట్ వీ2 ప్లస్ స్కూటర్ సౌకర్యవంతమైన, రేడియంట్ రెడ్, పాస్టెల్ పీచ్, సఫయర్ బ్లూ, మింట్ గ్రీన్, పెర్ల్ వైట్, మ్యాట్ బ్లాక్ & కాంబాట్ గ్రీన్ వంటి ఆకర్షణీయమైన అందుబాటులో ఉంటుంది. మిగిలిన ఫీచర్లు రేసర్ లైట్ వీ2 మాదిరిగానే ఉంటాయి.

ఓలా ఎస్1 ఎయిర్ ఈవీ స్కూటర్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 151 కి.మీ.ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్ 5.5 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కి.మీ.ల వేగంతో దూసుకుపోతుంది. ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ ఏడు అంగుళాల కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్, మూవ్ ఓఎస్ 4.0, డిజిటల్ స్పీడోమీటర్‌తో పాటు నావిగేషన్, బ్లూటూత్, వైఫైలతో వస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ ఈవీ స్కూటర్ ధర రూ.1.06 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్కూటర్ 550 వాట్స్ బీఎల్‌డీసీ మోటారుతో శక్తిని పొందుతుంది. అలాగే ఈ స్కూటర్ 1.2 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 52.2వీ, 30 ఏహెచ్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌ సింగిల్, డబుల్ బ్యాటరీ వేరియంట్లలో అందిస్తుంది. డబుల్ బ్యాటరీ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ.లు ప్రయాణించగలదు, గంటకు 45 కి.మీ.ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

నియో ఎస్ఎక్స్ ఎట్రాన్స్ ఈవీ స్కూటర్ రూ. 73,999 (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంటుంది. ఈ ఈవీని 47 కి.మీ/గం గరిష్ట వేగంతో పాటు 1.8 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో సమర్థవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పరిగణిస్తారు. ఈ స్కూటర్ 85-101 కి.మీ పరిధిని అందిస్తుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు