బిగ్ షాక్.. రేపోమాపో తులం బంగారం ధర లక్ష!

రేపోమాపో తులం బంగారం ధర లక్ష రూపాయలను చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాట పట్టాడు. అన్ని దేశాలకు సుంకాలు విధించాడు. దీంతో బంగారం ధర ఆకాశాన్ని తాకనుందనే అభిప్రాయం మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరుకోనుందని వారు చెబుతున్నారు. అయితే జస్ట్ ఒక మాసం క్రితం అంటే.. మార్చి 2వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.85,320గా ఉంది. కానీ ఒక నెల రోజులకు అంటే.. ఏప్రిల్ 2వ తేదీకి రూ.11,983 పెరిగి.. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 91, 115గా స్థిరంగా ఉంది. ఇక ప్రపంచ మార్కెట్‌లో బంగారం మాత్రం కొత్త రికార్డులు సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. అదీకాక.. బంగారం ధరలు అల్ టైమ్ హైలో కొనసాగుతోన్నాయి. పర్ ఔన్స్ బంగారం రూ.3,148.88 డాలర్లుగా ఉంది. అంతుకు ముందు రూ.3,132.53 డాలర్ల వద్ద ఈ ధర స్థిరంగా ఉంది.

ఇక ప్రపంచ మార్కెట్‌లో బంగారం రికార్డులను సృష్టిస్తోంది. స్పాట్ బంగారం ధర ఔన్సుకు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 3,148.88 డాలర్లకు చేరుకుంది. అనంతరం రూ.3,132.53 డాలర్ల వద్ద స్థిరపడింది.ఇక యూఎస్ గోల్డ్ ఫ్యూచర్ సైతం 0.4% పెరిగి రూ. 3,164.20 డాలర్లకు చేరుకుంది.

ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు చుక్కలను తాకుతొందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉందని పలువురు పేర్కొంటున్నారు. కానీ 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష చేరడం అసాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే 10 గ్రాముల బంగారం ధర రూ. లక్ష చేరడానికి.. ఇంకా రూ. 9 వేలు పెరగాల్సి ఉందన్నారు. కానీ అంత ధర ఈ మధ్య పెరిగే అవకాశం లేదనే అభిప్రాయాన్ని సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు