పోస్ట్ ఆఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరితే ప్రతి నెల రూ. 20 వేలు!

ప్రతినెల కొంత ఆదాయం వచ్చేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను అనుసరిస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్‌ పొందే పథకాలు పోస్టాఫీసులలో ఉన్నాయి. మీరు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని అందించే పథకం కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది మీకు ప్రతి నెలా రూ. 20,500 పెన్షన్ లభించే పథకం. ఈ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించారు. తద్వారా వారు పదవీ విరమణ తర్వాత కూడా డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పోస్ట్ ఆఫీస్ పథకం:

మీరు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా మీకు స్థిర ఆదాయాన్ని ఇచ్చే, మిమ్మల్ని రిస్క్ నుండి రక్షించే ఎంపికను కోరుకుంటే, పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మీకు గొప్ప ఎంపిక. కానీ పెట్టుబడి పెట్టే ముందు మీరు దానికి సంబంధించిన నిబంధనలు, షరతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రతి నెలా రూ. 20,500 ఆదాయం:

ఈ పథకంలో మీరు గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే మీకు ఏటా దాదాపు రూ.2 లక్షల 46 వేల వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతి నెలా రూ. 20,500 మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం వడ్డీ రేటు 8.2 శాతం. ఇది ఏ ప్రభుత్వ పథకంలోనూ అందుబాటులో ఉన్న అత్యధిక రేట్లలో ఒకటి.

మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి?

గతంలో ఈ పథకంలో పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు దానిని రూ. 30 లక్షలకు పెంచారు. ఈ పథకంలో పెట్టుబడిని ఒకేసారి చేయాలి. అలాగే వడ్డీ ప్రతి త్రైమాసికంలో మీ ఖాతాలో జమ అవుతుంది. మీరు కోరుకుంటే దానిని మీ నెలవారీ ఖర్చులుగా కూడా ఉపయోగించవచ్చు.

ఈ స్కీమ్‌లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?

ఇందులో పెట్టుబడి పెట్టడానికి మీ వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మీరు భారతీయ పౌరుడు అయి ఉండాలి. పదవీ విరమణ తీసుకున్న 55 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు. మీరు పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి ఈ ఖాతాను తెరవవచ్చు.

పన్నులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది:

ఈ పథకంలో వచ్చే వడ్డీ ఆదాయంపై మీరు పన్ను చెల్లించాలి. అయితే, పెట్టుబడి మొత్తం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హమైనది.

కాలపరిమితి వ్యవధి ఎంత?

ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మీరు దానిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. దీనిలో మీరు సమయానికి ముందే డబ్బును ఉపసంహరించుకోవచ్చు. కానీ దీనికి పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు