భారతదేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీదారులు తమ కార్లను ఆకట్టుకునే ఆఫర్లుతో పాటు వివిధ రకాల డిస్కౌంట్లలో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి కూడా చేరింది. మారుతీ కంపెనీకు సంబంధించిన దాని హాట్ సెల్లింగ్ మోడల్‌లలో ఒకటైన ఫ్రాంక్స్ కారుపై మంచి డిస్కౌంట్లను ప్రకటించింది. మారుతీ ఫ్రాంక్స్ మోడల్‌పై మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటే ఇదే సరైన సమయం. వివరాల ప్రకారం మారుతీ బ్రాండ్ ఫ్రాంక్స్ కారుపై దాదాపు లక్ష రూపాయలకు ప్రయోజనాలను అందిస్తోంది.
ఫ్రాంక్స్ కారుపై ప్రకటించింన రూ.లక్ష డిస్కౌంట్స్‌లో రూ. 35,000 విలువైన నగదు తగ్గింపు, రూ. 43,000 విలువైన వెలాసిటీ కిట్ యాక్సెసరీ ప్యాకేజీ, రూ. 15,000 స్క్రాపేజ్ ప్రయోజనం, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్ ప్రస్తుతానికి ఏప్రిల్ నెల వరకు చెల్లుతుంది. అలాగే ఈ ఆఫర్ స్టాక్ లభ్యతను బట్టి కూడా ఉంటుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు సంబంధిత వివరాలను పొందడానికి సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించాలని మారుతీ ప్రతినిధులు చెబుతున్నారు. మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 7.52 లక్షలు కాగా, టాప్ మోడల్ రూ. 12.88 లక్షల వరకు (అన్నీ ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
మారుతీ ఫ్రాంక్స్ కారు 10 కంటే ఎక్కువ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కస్టమర్లు తమ అవసరానికి అనుగుణంగా పరిపూర్ణ ట్రిమ్‌ను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.ఈ కారులో 2 పెట్రోల్, 1 సీఎన్‌జీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అలాగే మైలేజ్ విషయానికొస్తే ఈ మోడల్ ట్రిమ్‌ను బట్టి 20.01 నుండి 22.89 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.