స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు.. సెన్సెక్స్ 1600 పాయింట్లు జంప్..

భారత స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలు.. చైనా-అమెరికా వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. తాజాగా ట్రంప్‌ సుంకాల అమలను మూడునెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మార్కెట్లలో సందడి కనిపించింది. దాదాపు మూడురోజుల తర్వాత మంగళవారం మార్కెట్లు మొదటి నుంచి చివరకు వరకు లాభాల్లో ట్రేడయ్యాయి. చాలారోజుల తర్వాత సెన్సెక్స్‌ మళ్లీ 76వేల మార్క్‌ని దాటింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 75,157.26 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.

మార్కెట్‌ మొదలైన ప్రారంభమైన కొద్దిసేపట్లోనే సెన్సెక్స్‌ దాదాపు 1600 వరకు పెరిగింది. ఇంట్రాడేలో 76,435.07 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెస్సెక్స్‌.. గరిష్ఠంగా 76,907.63 పాయింట్ల వరకు చేరింది. చివరకు 1,577.63 పాయింట్ల లాభంతో 76,734.89 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 500 పాయింట్లు పెరిగి 23,328.55 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి మూడు శాతం పెరిగాయి. రియల్టీ ఇండెక్స్ ఐదుశాతానికిపైగా పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ నిఫ్టీలో భారీగా లాభాలను ఆర్జించగా.. హెచ్‌యూఎల్‌, ఐటీసీ నష్టపోయాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు