వామ్మో.. నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం బాగా పెరిగినప్పటికీ, సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోకి ఇటీవల నకిలీ చెల్లింపు యాప్స్ వచ్చాయి. వీటిని చూస్తే నిజంగా GPay, PhonePe, Paytmల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ నిజానికి ఇవి ఫేక్ చెల్లింపు యాప్‌లు. ఇవి డబ్బు పంపిన తర్వాత నోటిఫికేషన్‌ పంపించినట్లు చూపిస్తాయి. కానీ చెల్లింపు మాత్రం జరగదు.

ఇలాంటి వాటి విషయంలో విక్రేతలు లేదా వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నకిలీ యాప్‌లను ఉపయోగించి అనేక మంది మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రత్యేకించి చిన్న వ్యాపారులు ఈ మోసాల వల్ల ఎక్కువగా నష్టపోతారని చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులు, వ్యాపారులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నకిలీ యాప్‌ల వలలో పడకుండా, అసలైన యాప్‌లను మాత్రమే గుర్తించడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో మోసాలను గుర్తించి, అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని నిపుణులు సూచించారు.

నోటిఫికేషన్ వస్తుంది కానీ డబ్బులు రావు

మార్కెట్లో యాక్టివ్‌గా ఉన్న ఈ నకిలీ చెల్లింపుల్లో కొన్ని చాలా అధునాతనమైనవి కావడంతో వాటిని గుర్తించడానికి చిన్న చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ యాప్ చెల్లింపు నోటిఫికేషన్‌ బీప్ సౌండ్ నిజం మాదిరిగా అనిపించడంతో అనేక మంది కూడా గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా చెల్లింపు పూర్తయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ చెల్లింపు జరగదు. డబ్బు కూడా ఖాతాలోకి రాదు.

నకిలీ చెల్లింపు యాప్‌లను ఎలా నివారించాలి

మోసపూరిత లావాదేవీల విషయంలో స్కామర్లు నకిలీ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తారు. ఆ క్రమంలో వ్యాపారులు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ చెల్లింపు యాప్ లేదా బ్యాంక్ లావాదేవీలను ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. స్క్రీన్‌షాట్‌లు లేదా నోటిఫికేషన్‌లపై మాత్రమే ఆధారపడవద్దు. లావాదేవీ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయో లేదా పరిశీలించాలి. లావాదేవీని త్వరగా పూర్తి చేయమని మిమ్మల్ని ఒత్తిడి చేసే, మీకు సమయం ఇవ్వని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఈ యాప్స్ గురించి

మీ ప్రాంతంలో సాధారణంగా ఉపయోగించే చట్టబద్ధమైన చెల్లింపు యాప్‌ల గురించి తెలుసుకోండి. ఎవరైనా తెలియని యాప్ ద్వారా చెల్లింపు చేయమని అడిగితే జాగ్రత్తగా వహించాలి. రద్దీగా ఉండే దుకాణంలో గందరగోళాన్ని లేదా వ్యాపారి దృష్టి మరల్చడాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్ళు ఈ నకిలీ చెల్లింపు యాప్‌లను ఉపయోగించి మోసం చేసే అవకాశం ఉంది. ఈ మోసపూరిత లావాదేవీల గురించి అందరికీ అవగాహన కల్పించండి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు