ఒక్క అడుగు. ఒకే ఒక్క అడుగు. బంగారం లక్ష రూపాయల మార్క్‌కు చేరడం ఇక లాంఛనమే. ఒక్క అడుగు వెనక్కేస్తే, రెండు అడుగులు ముందుకు అన్నట్లుగా బంగారం పరుగులు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్‌టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువ కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. దీనికి కారణం అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలు.. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు.. ఇలా పలు కారణాలతో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేల మార్కుకు చేరువలో ఉంది.
మూడు రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా రూ.2500 వరకు పెరిగింది. అయితే, వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు కాస్త ఊరట కల్పించాయి. ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
స్థిరంగా బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో మూడు రోజుల పాటు పెరిగిన గోల్డ్ రేటు ఇవాళ ఊరట కల్పిస్తూ స్థిరంగా ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.97 వేల 580 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.89 వేల 450 వద్ద కొనసాగుతోంది.
మూడు రోజులుగా వెండి ఇలా..
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నా వెండి మాత్రం కాస్త ఉపశమనం ఇస్తోంది. గత మూడు రోజుల్లో బంగారం ధర పెరగగా వెండి స్థిరంగా ఒకే రేటు వద్ద కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద ఉంది.