సరికొత్త లాకర్ సిస్టమ్స్‌ని ఆవిష్కరించిన గోద్రెజ్..

 సెక్యూరిటీ సొల్యూషన్స్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ మార్కెట్‌లోకి సరికొత్త ప్రీమియం, టెక్ ఆధారిత హోమ్ లాకర్లను ప్రవేశపెట్టింది. ఇటు కన్స్యూమర్ అటు ఇనిస్టిట్యూషనల్ సెగ్మెంట్లలో అగ్రగామిగా కొనసాగుతున్న కంపెనీ.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించే లక్ష్యంతో సరికొత్త లాక్లను ఆవిష్కరించింది.

‘నేడు సెక్యూరిటీ అంటే రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా ఉండే ఇంటెలిజెంట్ సొల్యూషన్స్‌ అందించడం ద్వారా వినియోగదారులకు మరింత సాధికారత కల్పించే విషయంగా మారింది. పట్టణీకరణ వేగవంతం అవుతుండటం, సెక్యూరిటీతో పాటు కళాభిరుచికి కూడా ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో హైదరాబాద్‌ లాంటి మార్కెట్లలో హోమ్, ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీ విభాగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ సేఫ్‌కీపింగ్‌కి మించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త ఆవిష్కరణలతో, వినూత్న సొల్యూషన్స్‌ను అందించడం ద్వారా ఈ అవకాశాలను గోద్రెజ్ అందిపుచ్చుకుంటోంది. పట్టణ, సెమీ-అర్బన్ వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా మా లేటెస్ట్ స్మార్ట్ హోమ్ లాకర్లను డిజైన్ చేశాం. ఇందులో బయోమెట్రిక్ యాక్సెస్ నుంచి అలారం సిస్టంల వరకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్‌గా ఉంటోంది. పటిష్టమైన రిటైల్, డిజిటల్ వ్యూహాలతో ఇక్కడ మరింతగా విస్తరించడమనేది, స్థానికంగా అన్ని వర్గాలవారికి అనువైన ఇంటెలిజెంట్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను మరింతగా అందుబాటులోకి తేవడంపై మా నిబద్ధతను తెలియజేస్తుంది’ అని గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు