మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంత ఉందంటే?

దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ముగింపుతో పోలిస్తే గురువారం నాడు రూ.200 మేర పెరిగి రూ.99,400కు చేరుకుంది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తల కారణంగా బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల లక్ష దాటిన బంగారం ధర ఆ తరువాత కరెక్షన్‌ చోటుచేసుకోవడంతో ఏకంగా రూ2400 మేర తగ్గి బుధవారం రూ.99,200కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక 99.5 నాణ్యత గల బంగారం ధర కూడా రూ.200 మేర పెరిగి రూ.98,900కు చేరుకుంది.

ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.700 మేర పెరిగి రూ.99,900కు చేరుకుంది. ఇటీవల లక్ష దాటిన బంగారం ధర.. మదుపర్ల లాభాల బుకింగ్‌తో కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే, ధరలు మళ్లీ పెరిగే అవకాశం కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక ఒడిదుడుకులు కొనసాగుతున్న వేళ సురక్షిత పెట్టుబడుల వైపు మరోసారి జనాలు మళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఈ ఏడాది చివరికల్లా 4000 డాలర్లకు చేరొచ్చని జేపీ మార్గొన్ అంచనా వేసింది. అమెరికా సుంకాల భయాలతో పాటు చైనాతో ముదురుతున్న వాణిజ్య యుద్ధం పరిస్థితి సంక్లిష్టంగా మార్చొచ్చని అంచనా వేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు