ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఐపీఓ.. నేడే షురూ.. ఒక్కో షేరుకు ఎంతంటే?

దేశీయ దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీల్లో ఒకటైన ఏథర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఏథర్ ఎనర్జీ ఐపీఓకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ కంపెనీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ప్రారంభమవుతోంది. దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ కావడంతో ఏథర్ ఎనర్జీ ఐపీఓ పై మదుపరుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ వివరాలు, జీఎంపీ, వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రెండు నెలల తర్వాత ప్రైమరీ మార్కెట్ మెయిన్ బోర్డు విభాగంలో వస్తున్న ఐపీఓ కావడంతో ఏథర్ ఎనర్జీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పబ్లిక్ ఆఫరింగ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 28, 2025 రోజున మొదలై ఏప్రిల్ 30, 2025 బుధవారం రోజు ముగుస్తుంది. ఏథర్ ఎనర్జీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.304-321గా నిర్ణయించారు. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.2,626 కోట్లు సమీకరించనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు, ఇతర వాటాదారులు 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు.

మొత్తం ఐపీఓ ద్వారా వచ్చిన రూ.927.2 కోట్లను మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే రూ.40 కోట్లు రుణాల చెల్లింపుల కోసం, రూ.750 కోట్లను పరిశోధన, అభివృద్ధఇలో పెట్టుబడి పెట్టేందుకు, రూ.300 కోట్లను మార్కెటింగ్ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ నిధులను 2026 నుంచి 2028 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగించాలని భావిస్తున్నామని తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు