పసిడి కొనేవారికి అదిరిపోయే వార్త.. అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన ధరలు..

బంగారం ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధర భారీగా పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం పసిడి ధర రూ.1000 తగ్గి తులానికి రూ.98,400 చేరింది. ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం.. 99.9 ప్యూరిటీ గోల్డ్‌ గురువారం పది గ్రాముల ధర రూ.99,400 వద్ద ముగిసింది. ఇక 99.5 ప్యూరిటీ గోల్డ్‌ సైతం రూ.1000 పతనమై తులానికి రూ.97,900కి చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా పెట్టుబడిదారులు రిస్క్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.

దాంతో బంగారం ఆస్తులకు డిమాండ్‌ తగ్గించింది. డాలర్‌ బలపడిన నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ధరలు తగ్గుతున్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. చైనా 125 శాతం సుంకాల నుంచి యూఎస్‌ దిగుమతులను మినహాయించనున్నట్లు ప్రకటించింది. అయితే, అధికారిక వాణిజ్య చర్చల జరుగుతున్నాయన్న వార్తలను తిరస్కరించింది. అయితే, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధం భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంపై మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా పేర్కొన్నారు. ప్రధాన శక్తుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేశారు.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా వ్యాపారులు నిరసన వ్యక్తం చేయడంతో శుక్రవారం స్థానిక బులియన్‌ మార్కెట్లు మూతపడ్డాయి. మరో వైపు సోమవారం వెండి ధర రూ.1400 తగ్గి.. కిలో ధర రూ.98,500కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం దాదాపు ఒక శాతం తగ్గి ఔన్సుకు 3,291.04 డాలర్లకు చేరుకుంది. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్‌ కరెన్సీ రీసెర్చ్ విశ్లేషకుడు వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ అమెరికా అనేక దేశాలతో సుంకాలపై చర్చలు ప్రారంభించడం, చైనా-యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్‌ తగ్గుతున్నది. అంతేకాకుండా, రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై నేపథ్యంలోనే డిమాండ్‌ పడిపోతున్నది.
ఆసియా మార్కెట్లో స్పాట్ వెండి 0.2 శాతం తగ్గి ఔన్సుకు 33.05 వద్ద ట్రేడవుతున్నది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు