భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

ఏప్రిల్ 29(సోమవారం)న దలాల్ స్టీట్‌‌లో బుల్ ర్యాలీ తిరిగి కనిపించింది. బెంచ్‌మార్క్ సూచీలు గత రెండు సెషన్‌ల నష్టాలను భర్తీ చేశాయి. ఐటీ మినహా రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా అన్ని రంగాల హెవీవెయిట్‌ స్టాక్ లలో భారీగా కొనుగోళ్లు జరగడంతో నిఫ్టీ 24,300 పైకి తిరిగి చేరుకుంది.

ఇవాళ భారత దేశీయ సూచీలు వారాన్ని(సోమవారం) సానుకూలంగా ప్రారంభించాయి. మంచి గ్యాప్ అప్ తో మార్కెట్లు మొదలయ్యాయి. అదే ఊపుని తర్వాత కూడా కొనసాగించాయి. ఒక దశలో నిఫ్టీ ఇంట్రాడేలో 24,350ని దాటింది. మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు లేదా 1.27 శాతం పెరిగి 80,218.37 వద్ద ఉంది. నిఫ్టీ 289.15 పాయింట్లు లేదా 1.20 శాతం పెరిగి 24,328.50 వద్ద ఉంది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బిఐ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా, జెఎస్‌డబ్ల్యు స్టీల్ నిఫ్టీలో అత్యధికంగా లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యుఎల్ నష్టపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య(ఇండియా – పాక్ వార్) రక్షణ సంబంధిత షేర్లును మదుపర్లు గణనీయంగా కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లో ఫుల్ జోష్ కనిపించింది. హెచ్‌ఎఎల్, బిఇఎల్ వరుసగా 5 శాతం, 3 శాతం పెరిగాయి. మెటల్, రియాల్టీ, చమురు & గ్యాస్, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్ 1-3 శాతం పెరిగాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు