కొంతకాలంగా పరుగులు పెట్టిన పసిడి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది. ముఖ్యంగా వారం రోజులుగా బంగారం ధరలలో అంతగా పెరుగుదల కనిపించడం లేదు. దీంతో పసిడి కొనుగోలుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు సామాన్యులు. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న అంటే గురువారం 22 క్యారెట్ల పసిడి రూ.87,750 ఉండగా.. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,730 .. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,720 చేరింది. దీంతో అటు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్లో బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,720కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.