కాలేజ్ స్టూడెంట్స్‌కు ది బెస్ట్ స్కూటర్స్ ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా మధ్యతరగతి ప్రజలు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు త పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని కాలేజీ విద్యార్థులకు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేసి ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఈవీ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

హోండా క్యూసీ ఈవీ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 90,000గా ఉంది. హోండా క్యూసీ-1 అనేది 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో శక్తినిస్తుంది. దీనిని సింపుల్‌గా ఇంట్లో ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో 80 కి.మీ పరిధిని అందిస్తుంది. క్యూసీ1 రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ 0–80 శాతం వరకు ఛార్జ్ కావడానికి 4.3 గంటలు పడుతుంది.

ఓలా ఎస్1 ఎక్స్ జెన్-3 అత్యంత సరసమైన స్కూటర్‌గా ఉంది. ఈ స్కూటర్ 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన బేస్ వెర్షన్ ధర రూ. 73,999గా ఉంది. ఈ స్కూటర్ 108 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే 101 కి.మీ. గరిష్ట వేగంతో వస్తుంది. కేవలం 3.4 సెకన్లలో 0–40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీ ప్యాక్‌ను 4 గంటల 50 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

హీరో విడా వీ2 అనేది విడా శ్రేణికు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్. వీ2 లైట్ స్కూటర్ ధర అనేది రూ. 85,000గా ఉంది. ఈ స్కూటర్ దాని 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 94 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే ఇది 69 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. హీరో విడా వీ2 బరువు 116 కిలోలుగా ఉంది. హీరో విడా వీ2 లైట్ నాలుగు రంగుల్లో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను 0–80 శాతం వరకు 3.3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ ఇటీవల కాలంలో అమ్మకాల్లో రికార్డులను సృష్టిస్తుంది. ఎంట్రీ లెవల్ చేతక్ 3503 ధర రూ. 1.09 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 155 కి.మీ. పరిధిని అందిస్తుంది. కళాశాలలో స్టైలిష్‌గా ఉండాలంటే చేతక్ ఈవీ మంచి పరిష్కారంగా ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ కేవలం కాలేజీకి వెళ్లి తిరిగి రావడానికి మాత్రమే కాకుండా ఇది ఒక గొప్ప ఫ్యామిలీ స్కూటర్‌గా ఉంటుంది. రూ. 1.08 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఐక్యూబ్ స్కూటర్ వస్తుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌పై 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు