“ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) పేరిట చేపట్టిన దాడులు ఉగ్రవాదులనే కాదు. పాక్ షేర్ మార్కెట్లనూ ఉక్కిరిబిక్కిరి చేశాయి. మార్కెట్లు ప్రారంభమైన క్షణం నుంచీ సూచీలు నేలచూపులే (Pak Share Markets Down) చూశాయి. మొత్తంగా పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ బ్లడ్ బాత్ చేసింది.
భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయనే సూచనలు ఉన్నప్పటికీ భారత మార్కెట్లు ఇవాళ లాభాల్లోనే ముగిశాయి. ఇందుకు విరుద్ధంగా KSE 100 (కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్) ప్రారంభ ట్రేడింగ్‌లోనే 6,272 పాయింట్లు లేదా 6% పడిపోయింది. రోజు గడిచేకొద్దీ KSE-100 ఇండెక్స్ క్షీణించి 112,076.38 కనిష్ఠ స్థాయికి చేరుకుంది. పాక్ ఇన్వెస్టర్లలో యుద్ధ భయాందోళనలు రేకెత్తడం వల్ల భారీ అమ్మకాలకు దారితీసి మార్కెట్లు బ్లడ్ బాత్ చేశాయి. డాలరు బలహీనపడటం, అమెరికా, చైనా వృద్ధిలో తగ్గుదల, క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు కూడా కరాచీ మార్కెట్లను కుదేలయ్యేలా చేశాయని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX) కోలుకునే సంకేతాలు కనిపించడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.