బిల్‌గేట్స్ రూ.9 లక్షల కోట్లు దానం.. విప్లవాత్మక నిర్ణయం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదంలో 99 శాతాన్ని గేట్స్ ఫౌండేషన్‌కు (Gates Foundation) దానం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సంపదతో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టనున్నారు. 2045 నాటికి ఆ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి గేట్స్ ఫౌండేషన్‌ను పూర్తిగా మూసెయ్యాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుత లెక్కల ప్రకారం బిల్‌గేట్స్ సంపదలో 99 శాతం అంటే 107 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం 9 లక్షల కోట్ల రూపాయలు. అలాగే దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి రాబోయే 20 ఏళ్లలో మరో 200 బిలియన్ డాలర్లు (రూ.16 లక్షల కోట్ల రూపాయలకు పైగా)ను కూడా ఖర్చుపెట్టబోతున్నారు. ఈ డబ్బును పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆపై సంస్థను శాశ్వతంగా మూసివేయాలని యోచిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్‌కు ప్రపంచ కుభేరుడు అయిన వారెన్ బఫెట్ కూడా భారీగా విరాళాలు అందజేస్తుంటారు.

కాగా, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ (Elon Musk)పై ఇటీవల బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా పలు పేద దేశాలకు అందించే సహాయంలో మస్క్ కోత విధించిన సంగతి తెలిసిందే. ఎలన్ మస్క్ నిర్ణయం వల్ల పేద దేశాల్లో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని బిల్‌గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గేట్స్ ఫౌండేషన్‌ను బిల్‌గేట్స్, మిలిందా 2000 సంవత్సరంలో స్థాపించారు. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఛారిటబుల్ ట్రస్ట్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు