బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు తగ్గాయి. లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు భారీగా పడిపోయింది. 98 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. యుద్ధం ముగిసి, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా బంగారం ధరలు దిగజారుతూ ఉన్నాయి. మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

13వ తేదీనాటి బంగారం ధరలు ఇలా..

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. నిన్న హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 96880 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88800 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72660 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 96870 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88790 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72650 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు