భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ఇవే టాప్ 5 ప్రాఫిట్ స్టాక్స్

భారత స్టాక్ మార్కెట్లు (Stock market) నేడు (మే 21, 2025) లాభాలతో మొదలై, క్రమంగా పుంజుకున్నాయి. దీంతో నిన్నటి భారీ నష్టాల నుంచి మార్కెట్ రికవరీ అయ్యిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఉదయం 10.36 గంటల నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడగా, NSE నిఫ్టీ 259 పాయింట్లు ఎగబాకింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 457పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 532 పాయింట్లు పైకి చేరింది. ఈ క్రమంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. మరికొంత మంది ఇన్వెస్టర్లు మాత్రం నష్టపోయారు.

టాప్ గెయినర్లు & లూజర్లు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ ఎలక్ట్రికల్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, సిప్లా, ఎం అండ్ ఎం కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎటర్నల్ కంపెనీల స్టాక్స్ టాప్ 4 నష్టాల్లో ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే నిఫ్టీ IT 0.4% తగ్గింది. నిఫ్టీ ఫార్మా 1.4% లాభపడగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.1%, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.1% తగ్గింది.

BSNL ప్రాజెక్ట్‌లో అదనపు ఆర్డర్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తేజస్ నెట్‌వర్క్స్ మధ్య ఉన్న మాస్టర్ కాంట్రాక్ట్‌లో భాగంగా, BSNL నుంచి 18,685 4G మొబైల్ నెట్‌వర్క్ సైట్ల కోసం TCS కు అదనపు అడ్వాన్స్ పర్చేస్ ఆర్డర్ వచ్చింది. ఈ క్రమంలో తేజస్ నెట్‌వర్క్స్ అందించాల్సిన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN), ఇతర పరికరాల విలువ సుమారు రూ.1525.53 కోట్లుగా అంచనా. దీంతో తేజస్ నెట్‌వర్క్స్ షేరు ధర NSEలో 3.22% పెరిగి రూ.746.90కు చేరుకోగా, TCS షేరు ధర రూ.3,512.50 స్థాయిలో ఉంది.

అంతర్జాతీయ అంశాల మధ్య, ముడి చమురు ధరలు మళ్లీ దూసుకుపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ అణు కేంద్రాలపై దాడి చేయాలని ఇరాన్‌ యోచిస్తున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ముడి చమురు ఫ్యూచర్లు బుధవారం ఉదయం పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9:26 గంటల సమయానికి, జూలై బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ 1.48% పెరిగి $66.35 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) జూలై ముడి చమురు ఫ్యూచర్స్ 1.61% పెరిగి $63.03 వద్ద ఉన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు